Header Banner

ఆపరేషన్ సిందూర్.. బీజేపీ "తిరంగ యాత్ర".. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ యాత్రలో.!

  Mon May 12, 2025 21:09        Politics

భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైన నేపథ్యంలో, బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'తిరంగా యాత్ర' పేరుతో భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మే 13న ప్రారంభం కానున్న ఈ యాత్ర, 11 రోజుల పాటు అంటే మే 23 వరకు కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమతో పాటు, భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను, పరాక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ 'తిరంగా యాత్ర' యొక్క ముఖ్య ఉద్దేశ్యమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ యాత్ర నిర్వహణ, ప్రణాళికపై చర్చించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం వరుస సమావేశాలు నిర్వహించింది. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. అనంతరం సోమవారం నడ్డా.. పార్టీ నేతలు తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, దుశ్యంత్ గౌతమ్‌లతో మరోసారి సమావేశమై యాత్రకు సంబంధించిన తుది ప్రణాళికను ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ 'తిరంగా యాత్ర'లో సమాజంలోని పలువురు ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేయాలని బీజేపీ భావిస్తోంది. కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో చురుగ్గా పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #MedaramJatara #MedaramJataraCelebration #India #BigFestivalInIndia #BigFestivalMedaramJatara #ModiSpeechAboutJatara